పఠాన్, జవాన్, డంకి వంటి వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉన్న బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం 'కింగ్' అనే మూవీ చేస్తున్నాడు. సుజోయ్ ఘోష్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మీద షారుక్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి.
ఇక జార్ఖండ్ కి చెందిన షారుక్(shah rukh khan)అభిమాని ఒకరు ఎలాగైనా సరే షారుక్ ని కలవాలని ముంబై లోని షారుక్ ఇంటికి చేరుకున్నాడు. అలా ఏకంగా తొంబై ఐదు రోజుల పాటు షారుక్ కోసం ఇంటి ఎదురే ఉన్నాడు. ఎవరు ఎంత చెప్పినా వినకుండా తన ఉద్యోగం వదిలి మరి అక్కడే వేచి ఉండటంతో విషయం తెలుసుకున్న షారుక్ తన అభిమాని ని ఇంటి లోపలకి పిలిచి అతని నుంచి వివరాలు అడిగి ఫోటో కూడా దిగాడు.ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
హృతిక్ రోషన్(hrithik roshan)ఎన్టీఆర్(ntr)లు కలిసి చేస్తున్న వార్ 2(war 2)లో కూడా షారుఖ్ ఒక కీలక పాత్రలో చేస్తున్నాడని, అందుకు సంబంధించిన షూటింగ్ లో కూడా షారుక్ పాల్గొనబోతున్నాడని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.